COLLOCATIONS - 3

COLLOCATIONS - 3

కొన్ని మాటలు, ఇతర మాటలతో కలుస్తుంటాయి. 
పెద్దవాననెప్పుడూ 'Heavy' rain అనే అంటాం, సామాన్యంగా big rain అనం. ఇలాంటి word combinationనే collocation అంటామని గుర్తుంది కదా!
Arun: You weren't there yesterday. There was a heated debate on whether we should lease or buy the building.(నిన్న నువ్వు లేవక్కడ. ఆ బిల్డింగును మనం అద్దెకు తీసుకోవాలా, లేకుంటే కొనాలా అనే అంశమ్మీద చాలా వేడిగా చర్చ జరిగింది.)
Amar: Unfortunately I couldn't be present at the debate. I had to rush to the hospital, because a cousin of mine sustained fatal injuries in a road accident.(దురదృష్టవశాత్తు నేను లేనప్పుడు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయ గాయాలతో ఉన్న మా మామయ్య కొడుకును చూడటానికి పరుగు పరుగున వెళ్లాల్సి వచ్చింది.)
Arun: Did he survive? (బతికాడా అతడు?)
Amar: I told you it was fatal. None can survive such an accident. He was spot dead.
(చెప్పాను కదా ప్రాణాపాయకర ప్రమాదం అని. ఎవరూ అలాంటి ప్రమాదం తర్వాత బతికే అవకాశం ఉండదు)     There was profuse bleeding at the spot of the accident. The truck driver tried to run away but the passers by caught hold of him and handed him to the traffic constable. He was giving evasive replies to the questions of the constable. We have lodged a complaint immediately.(రక్తం విపరీతంగా కారిపోయింది, ఆ ప్రమాదస్థలంలో, లారీ డ్రైవరు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా దారిన వెళ్తున్నవారు పట్టుకొని Traffic constable కు పట్టిచ్చారు. ఎన్ని అడిగినా కప్పదాటుడు సమాధానాలు చెప్తున్నాడు. మేం వెంటనే police station లో ఫిర్యాదు చేశాం)

Arun: Very sorry to hear all this. The police don't pursue the case unless you bring some pressure on them. They make empty promises and delay even filing the case.(వినడానికి చాలా విచారకరంగా ఉంది. నువ్వు పోలీసువాళ్ల మీద ఒత్తిడి తెస్తే తప్ప వాళ్లు case ను పట్టించుకోరు. వాళ్లు ఉత్తుత్తి మాటలు చెప్పి case నమోదు చేయడం కూడా ఆలస్యం చేస్తారు)
Amar: The police were very busy yesterday, as trouble broke out in the market area between two groups. I am going to them again this evening. (Police నిన్న అసలు తీరిక లేకుండా ఉన్నారు, మార్కెట్ దగ్గర ఎక్కడో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో. మళ్లీ ఈవేళ వెళ్తున్నా నేనక్కడికి)
Arun: Very few truck drivers conform to safety rules. They violate rules as they like. The other road users aren't much better either. They violate traffic rules too at great risk for themselves and others as well.
(చాలా తక్కువమంది లారీ డ్రైవర్లు traffic నిబంధనలు పాటిస్తారు. మిగతా వాహనాలు నడిపేవాళ్లు కూడా అంత మెరుగేం కాదు. తమకేకాకుండా ఇతరులకు కూడా ప్రమాదం కలిగేలా traffic నిబంధనలు ఉల్లంఘిస్తుంటారు)

Amar: OK. I must be going. My late cousin's wife and children will be waiting for me. I really pity them. See you later.(సరే, నేను వెళ్లాలి - మరణించిన నా cousin భార్య, పిల్లలు నా కోసం చూస్తుంటారు. నిజంగా వాళ్లను చూస్తే నాకు జాలేస్తుంది. కలుద్దాం.)
Look at the following expressions from the conversation above:
¤ There was a heated debate
¤ A cousin of mine sustained fatal injuries.
¤ He was spot dead
¤ There was profuse bleeding at the spot of the accident
¤ He was giving evasive replies
¤ We have lodged a complaint

1) A heated debate:Debate అంటే తెలుసు కదా- చర్చ. ఒక విషయానికి అనుకూలంగా, ప్రతికూలంగా ఉండే ఇద్దరి/ రెండు వర్గాల మధ్య జరిగే చర్చ. ఇలాంటిది తీవ్రస్థాయిలో,
వాడిగా జరిగితే అది heated debate అవుతుంది. Participants in a heated debate become emotional and excited. ఇందులో పాల్గొనేవారు ఆవేశం, ఉద్రేకాలతో మాట్లాడతారు.

a) There was a heated debate in the parliament on black money
b) The heated debate led the speakers to shout at the opposite side =ఆ heated debate అరుపులకు దారితీసింది.
c) The appointment of the CVC provoked a heated debate = 
నియామకం తీవ్రమైన చర్చను లేవనెత్తింది.
        
చర్చను లేవనెత్తడం- provoke a debate/raise a debate-ఇవి కూడా useful collocations.

2) Sustain injury: గాయపడటం/ గాయాలకు గురవడం. 
We use 'sustain' with 'injury' (గాయం), fracture(ఎముక/కీలు విరగడం), minor injuries (చిన్న చిన్న గాయాలు తగలడం)a) The passengers in the car sustained severe (తీవ్రమైన) injuries.b) The driver sustained a fracture
3) Spot dead: Death on the spot (site-స్థలం) of the accident - ప్రమాదం జరిగినచోట  మరణించడం/ అక్కడికక్కడే మృతి చెందడం. అక్కడికక్కడే అనే అర్థంతో spot దేంతోనైనా collocate అవుతుంది.
spot decision= అక్కడికక్కడే నిర్ణయించడం
spot payment = అక్కడికక్కడే చెల్లింపు.
      
ఇలాంటి చోట్లంతా spot = on the spot = అక్కడికక్కడే- spot settlement = అక్కడికక్కడే తీర్మానం.

4) Profuse bleeding: రక్తం ఎక్కువగా కారిపోవడం.
Bleeding = Flow of blood from any part of the body - దేహంలోంచి రక్తం కారడం. Profuse = ధారాళంగా/ఎక్కువగా.a) As a result of the injury, she was bleeding profusely through the nose = గాయం కారణంగా ఆమె ముక్కులోంచి రక్తం విపరీతంగా కారిపోతోంది.b) The knife injury caused profuse bleeding = కత్తి వల్ల గాయం తీవ్ర రక్తస్రావం కల్గించింది.
5) Evasive replies:     Your replies are evasive if they are not answers to the point = కచ్చితమైన సమాధానం కాకుండా కప్పదాటుడు సమాధానాన్ని evasive reply అంటాం. Here 'reply' collocate with 'evasive' -
    
Evasive explanation - వివరణ కచ్చితమైనది కాకపోవడం.
He gave an evasive explanation for his absence = అతడు గైర్హాజరవడాన్ని సరిగా వివరించలేదు.

6) Lodge a complaint: ఫిర్యాదు చేయడం - ముఖ్యంగా Police station లో, అధికారులకు.
a) A number of parents have lodged complaints with the police about their missing children = తప్పిపోయిన తమ పిల్లలను గురించి చాలామంది తల్లిదండ్రులు police station లో ఫిర్యాదు చేశారు.
b) You lodge a complaint. We'll see what we can do = మీరు ఫిర్యాదు చేయండి. ఏం చెయ్యాలో మేం చూస్తాం.
'Lodge' always collocate with 'complaint'.
 'Book' also can be used with 'complaint'
Lodge a complaint = book a complaint. అయితే 'Lodge' 'book' కంటే ఎక్కువ formal - చట్ట పరిభాష.